అక్షయ తృతీయ రోజున బంగారం, వెండే కాకుండా ఇంకేం కొనవచ్చో తెలుసా?

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయ చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున బంగారం షాపులన్నీ వినియోగదారులతో కళకళలాడుతూ ఉంటాయి. దీపావళి, ధన త్రయోదశి మాదిరిగానే అక్షయ తృతీయను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభ ముహుర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వచ్చింది. ఈ రోజున హిందువులంతా లక్ష్మీ దేవికి పూజలు నిర్వహిస్తారు. పేదలకు దాన ధర్మాలు చేస్తారు.

ఈ ఏడాది అక్షయ తృతీయ 10 మే 2024 శుక్రవారం ఉదయం 4:17 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మే 11న తెల్లవారుజామున 2:50 గంటలకు ముగుస్తుంది. ఇక ఈ రోజున బంగారం, వెండి కొంటే చాలా మంచిదని భావిస్తారు. అయితే ఇవి రెండు మాత్రమే కాకుండా.. మరికొన్ని వస్తువులు కొన్నా కూడా మంచిదేనని భావిస్తూ ఉంటారు. అవేంటో చూద్దాం. భూమి, ఇల్లు లేదంటే వాహనం కొనుగోలు చేసినా కూడా బాగా కలిసొస్తుందట. అక్షయ తృతీయ రోజున అవసరంతో పని లేకుండా శక్తి కొలది ఇంట్లోకి ఏ వస్తువును తీసుకొచ్చినా మంచిదేనట. అయితే రోహిణి నక్షత్రంలో కొనుగోలు చేసేందుకు వెళ్లాలట. మే 10వ తేదీన ఉదయం 10.54 గంటల వరకు రోహిణీ నక్షత్రం ఉంది.

Share this post with your friends