శివుడి గురించి ఈ విషయం మీకు తెలుసా?

కోరిన కోరికలు తీర్చే దేవుడు శివుడు. శివుడిని భోళా శంకరుడని అంటారు. భక్తి శ్రద్ధలతో పూజించాలే కానీ ఆయన ఎలాంటి కోరికలైనా తీరుస్తాడు. ఇక శివుడు శివలింగరూపంలోనూ ఉంటాడు.. జ్యోతిర్లింగంగానూ ఉంటాడు. మరి శివలింగానికి, జ్యోతిర్లింగానికి ఏమైనా తేడా ఉందా? అనే అనుమానం చాలా మందికి వస్తుంది. అయితే ఏ శివాలయానికి వెళ్లినా శివలింగం కనిపిస్తుంది. కానీ జ్యోతిర్లింగ దర్శనమనేది అందరికీ సాధ్యం కాదు. ఇక శివలింగానికి, జ్యోతిర్లింగానికి మధ్య తేడా ఏంటో చూద్దాం. శివలింగం అనేది శివ పార్వతిల ఆదిమ రూపమని అంటారు.

శివలింగంలో భోలేనాతుడి కుటుంబం మొత్తం నివసిస్తుందట. జ్యోతిర్లింగం మహాదేవుని స్వయంభూ అవతారమే కాదు.. శివుని జ్యోతి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించారు. ‘జ్యోతి’ అంటే కాంతి, ‘లింగ’ అంటే సంకేతమని అర్థం. ఇక శివలింగాల మాదిరిగా జ్యోతిర్లింగాలు ఎక్కడపడితే అక్కడ కనిపించవు. కేవలం 12 చోట్ల మాత్రమే కనిపిస్తాయి. శివ పురాణం ప్రకారం శివలింగం అంటే ప్రారంభం, ముగింపు లేనిది అంటే శాశ్వతమైనది. శివలింగం శివునికి ప్రతీక. జ్యోతిర్లింగాలు 12 రాశులను సూచిస్తాయని ఆ మహాదేవుడే జ్యోతిగా జన్మించాడని చెబుతారు.

Share this post with your friends