వినడానికి విచిత్రంగా అనిపించే ఈ దేవాలయ కథేంటో తెలుసా?

కకాన్‌మఠ్ దేవాలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మనిషిని నడిపించే శక్తికైనా, యుక్తికైనా.. పాజిటివ్, నెగెటివ్‌ రెండూ ఉంటాయి. దీని నిర్మాణం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో.. దాని చుట్టూ అల్లుకున్న కథలు అంత ఆసక్తికరంగా ఉంటాయి. ఈ కథలే ఈ ఆలయానికి సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఆలయం ఈ నాటిది కాదు.. కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిందట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయట. అది కూడా రాత్రికి రాత్రే నిర్మించాయని స్థానికుల కథనం. వినడానికి విచిత్రంగా అనిపించే ఆ ఆలయం ఎక్కడుంది? దాని కథేంటో తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖజురాహో సమీపంలో ఈ కకాన్‌మఠ్ దేవాలయం ఉంది. ఇది పురాతన భారతీయ శిల్ప కళా నైపుణ్యానికి ఒక అద్భుత నిదర్శనం. స్థానిక పురాణాల ప్రకారం కకాన్‌మఠ్ దేవాలయాన్ని అతీంద్రియ శక్తులు.. ముఖ్యంగా చెప్పాలంటే దెయ్యాలు ఒక్క రాత్రిలోనే నిర్మించాయని చెబుతారు. దెయ్యాలు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్లను సేకరించాయట. వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాయని చెబుతారు. వినడానికి విచిత్రంగా ఉన్న ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు. అయితే ఈ ఆలయం గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచి ఈ కథ వినేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Share this post with your friends