ప్రదోష వ్రత కథ గురించి తెలుసా?

ప్రదోష వ్రత కథ విన్నా.. చదివినా పుణ్యమేనట. పూర్వం ఒక నగరంలో బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె భర్త మరణించడంతో పిల్లలను పోషించుకుంటూ జీవించేది. బ్రాహ్మణ స్త్రీ శివ భక్తురాలు.. పైగా ప్రదోష వ్రతం తప్పక ఆచరించేది. ఒకరోజు ఆమెకు ఒక గాయాలపాలైన యువకుడు కనిపించాడు. అతడిని తీసుకొచ్చి సపర్యలు చేసింది. ఆ తరువాత అతను విదర్భ రాకుమారుడని.. శత్రు సైనికులు దాడి చేయడంతో తప్పించుకుని వచ్చాడని తెలుసుకుంటుంది. అతని తండ్రిని శత్రు సైనికులు బంధీగా తీసుకున్నారు. ఇక విదర్భ రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీతో కలిసి ఉండేవాడు. ఒకరోజు అన్షుమతి అనే గంధర్వ రాకుమారి యువరాజుని చూసి మోహించి తన తల్లిదండ్రులతో వచ్చి కలుస్తుంది.

కొద్ది రోజులకు శివుడు అన్షుమతి తల్లిదండ్రులకు కలలోకి వస్తాడు. వారిద్దరికీ పెళ్లి చేయాలని చెబుతాడు. అన్షుమతి తండ్రి గంధర్వరాజు కావడంతో ఆయన సైన్యంతో కలిసి యువరాజు రాజ్యంపై దాడి చేసి విదర్భను తిరిగి స్వాధీనం చేసుకుంటాడు. తండ్రిని విడిపిస్తాడు. శత్రువులను తరిమేసి తండ్రిని బంధీల నుంచి విడిపిస్తాడు. ఇవన్నీ కూడా ప్రదోష వ్రతం చేసిన బ్రహ్మణి స్త్రీ ఆశ్రయం పొందిన తర్వాతే జరిగాయి. మొత్తంగా ఆమె ప్రదోష వ్రతం కారణంగా యువరాజు కష్టాలన్నీ తీరిపోయాయి. అందుకే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉందని అంటారు. ఈ వ్రత కథను చదివి శిరస్సుపై అక్షింతలు వేసుకుంటే గురు ప్రదోష వ్రత ఫలం దక్కుతుందట.

Share this post with your friends