నరదిష్టి అంత మంచిది కాదని అంటారు. నరదిష్టికి అశుభాలు తప్పవట. చాలా నష్టాలుంటాయని చెబుతుంటారు. నరదిష్టి కారణంగా అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం వంటివి జరుగుతాయట. ఇక ఇంట్లో కూడా ఫలితాలు ప్రతికూలంగానే ఉంటాయంటారు. మరి అలాంటి నరదిష్టికి ఏం చేయాలి? ఎలా తొలగించుకోవాలి? అంటే పురాణాల్లో అగస్త్య మహర్షి.. కంటి దృష్టి అనే రాక్షసుడిని సంహరించిన అనంతరం లోక సంరక్షణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఆ రాక్షస సంహారంతో మహాశక్తి ఉద్భవించిందట.
ఆ మహా శక్తి మరెవరో కాదు.. కంటి దృష్టి గణపతి. నరదిష్టి దోషాల నుంచి రక్షిస్తాడట. మహాశక్తి ఆయన దేవతలలో 33వ మూర్తిగా లోకాన్ని రక్షిస్తాడని విశ్వాసం. కాబట్టి దిష్టి గణపతి పటాన్ని ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచి జరుగుతుందట. అయితే ఎటువైపు పెట్టాలనేది కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉత్తరం దిశగా కంటి దిష్టి గణపతి పటాన్ని తగిలించాలి. పూజగదితో పాటు వ్యాపారం చేసే చోట, కార్యాలయాల్లోనూ కంటి దృష్టి గణపతి పటాన్ని తగిలిస్తే మనకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవట. ముఖ్యంగా నరదిష్టి మన దరి చేరదట. కాబట్టి నరదిష్టిని పారాదోలాలంటే కంటి దృష్టి గణపతి ఫోటోను మన దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది.