నవరాత్రి అనేది ఆది పరాశక్తి , దుర్గా దేవిని స్మరిస్తూ హిందువులంతా జరుపుకునే పండుగ. నవ రాత్రులు అనేవి మొదట చైత్ర మాసం (మార్చి-ఏప్రిల్), ఆ తరువాత అశ్విన్ నెలలో (సెప్టెంబర్-అక్టోబర్) ఉంటుంది. చైత్ర నవరాత్రిని వసంత నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. ఆమె తొమ్మిది రూపాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. చైత్ర నవరాత్రిని కాశ్మీరీ పండితులు.. నవ్రేహ్ అని పిలుస్తారు. మహారాష్ట్రలో గుడి పడ్వా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉగాదిని జరుపుకుంటారు.
మాఘ నవరాత్రి..
మాఘ నవరాత్రిని మాఘ మాసంలో (జనవరి-ఫిబ్రవరి) జరుపుకుంటారు. ఈ నవరాత్రిని గుప్త (రహస్య) నవరాత్రి అని కూడా అంటారు. ఈ పండుగ యొక్క ఐదవ రోజును తరచుగా స్వతంత్రంగా వసంత పంచమి లేదా బసంత్ పంచమిగా జరుపుకుంటారు. ఇది హిందూ సంప్రదాయంలో వసంత కాలం అధికారిక ప్రారంభంగా కూడా పేర్కొనవచ్చు.
ఆషాడ నవరాత్రి..
ఆషాఢ నవరాత్రిని గుప్త నవరాత్రి అని కూడా పిలుస్తారు, ఆషాఢ మాసంలో (జూన్-జూలై), వర్షాకాలం ప్రారంభంలో జరుపుకుంటారు.