ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే ఇది తొమ్మిదవ నెల. అయితే తెలుగు మాసాల ప్రకారం మాత్రం ఇది ఆరవ మాసం. భాద్రపదం అనగానే మనకుక వినాయక చవితి గుర్తొస్తుంది. ఈ నెలలో చాలా పర్వదినాలున్నాయి. వరాహ జయంతి, వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్ది, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్ష దినాలు వంటివెన్నో ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంది.
భాద్రపద మాసంలో పర్వదినాలు..
సెప్టెంబర్ 3 : భాద్రపద మాసం ప్రారంభం
సెప్టెంబర్ 6: భాద్రపద శుక్ల తదియ. వరాహ జయంతి. ఈ రోజు విష్ణువు వరాహ రూపం ధరించాడు.
సెప్టెంబర్ 7: భాద్రపద శుద్ధ చవితి. ఇది మనందరికీ తెలిసిందే. వినాయక చవితి పర్వదినం.
సెప్టెంబర్ 8: భాద్రపద శుద్ధ పంచమి. ఈ రోజు ఋషి పంచమి. ఇవాళ ఋషులందరినా తలచుకోవాలట.
సెప్టెంబర్ 11: భాద్రపద శుద్ధ అష్టమి. ఈ రోజు జ్యేష్ఠ గౌరీ పూజ. ఈ పూజను సీతాదేవి చేసిందని ప్రతీతి.
సెప్టెంబర్ 14: భాద్రపద శుద్ధ ఏకాదశి. ఈ రోజు పరివర్తన ఏకాదశి. ఈ రోజున లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని పూజించాలి.
సెప్టెంబర్ 15: భాద్రపద శుద్ధ ద్వాదశి: ఈ రోజు వామన జయంతి.
సెప్టెంబర్ 16: భాద్రపద శుద్ధ చతుర్దశి. కన్య సంక్రమణం. అంలే ఈ రోజున సింహరాశి నుంచి కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు.
సెప్టెంబర్ 17: భాద్రపద శుద్ధ పౌర్ణమి. ఈ రోజు అనంత పద్మనాభ వ్రతం.
సెప్టెంబర్ 18: భాద్రపద బహుళ పాడ్యమి. ఈ రోజు మహాలయ పక్షారంభం.
సెప్టెంబర్ 21: భాద్రపద బహుళ చవితి. సంకష్ట హర చతుర్థి వ్రతం.
సెప్టెంబర్ 24: భాద్రపద బహుళ అష్టమి. ఈ రోజు అనధ్యాయ తిథి.
సెప్టెంబర్ 28: భాద్రపద బహుళ ఏకాదశి. ఈ రోజు సర్వేషాం ఇందిరా ఏకాదశి.
సెప్టెంబర్ 29: భాద్రపద బహుళ త్రయోదశి. ఈ రోజు పక్ష ప్రదోషం.
సెప్టెంబర్ 29: భాద్రపద బహుళ చతుర్దశి. ఈ రోజు మాస శివరాత్రి.