హనుమంతుడు.. చిరంజీవి ఎలా అయ్యాడో తెలుసా?

హనుమంతుడు శక్తికి సంకేతం. బాధలోనూ.. కష్టంలోనూ ఉన్నప్పుడు మనకు గుర్తొచ్చేది హనుమంతుడే. వాటిని దాటగలిగే శక్తిని ప్రసాదించమని కోరుకుంటూ ఉంటాం. హనుమంతుడిని అంజనీ పుత్రుడు, పవన పుత్రుడు, సంకట్ మోచనుడు, రామ భక్త హనుమాన్, బజరంగబలి, మహాబలి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వీటితో పాటు మనం పిలిచే పేరు చిరంజీవ. అసలు హనుమంతుడికి ఈ పేరు ఎలా వచ్చింది? ఈ పేరుకి అర్థమేంటి వంటి అంశాలను చూద్దాం. చిరంజీవ అంటే మరణం లేని వ్యక్తి.. చిరకాలం జీవించి ఉండే వ్యక్తి అని అర్థం. మరి ఆ పేరు ఆయనకెలా వచ్చిందంటారా? సీతాదేవి కారణంగా వచ్చింది. ఆ కథేంటో చూద్దాం.

పురాణాల ప్రకారం.. రావణుడిని సీతాదేవి అపహరించిన విషయం తెలిసిందే. ఆమె జాడ తెలుసుకునేందుకు శ్రీరాముడు ఆజ్ఞతో హనుమంతుడు బయలుదేరుతాడు. లంకంతా గాలించి చివరకు ఆంజనేయుడు అశోక వనంలో సీతాదేవి జాడను గుర్తిస్తాడు. అమ్మవారి వద్దకు వెళ్లి తనను రాముడు పంపాడని చెబుతాడు. తొలుత సీతాదేవి నమ్మదు. కానీ రాముడు తన గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని చూపించగానే సీతాదేవి ఆనంద పరవశురాలవుతుంది. సీతాదేవి కన్నీటిని తుడిచి.. రాముడిపై తనకున్న భక్తిని ఆంజనేయుడు చాటుకుంటాడు. దీంతో సీతాదేవి హనుమంతుడిని చిరంజీవ అని దీవిస్తుంది. అదే పేరు హనుమంతుడికి చిరస్థాయికి నిలిచిపోయింది.

Share this post with your friends