తంజావూరులోని ‘ఉప్పిలి అప్పన్’ ఆలయం గురించి తెలుసా?

తమిళనాడు ఒక ఆధ్మాత్మిక ప్రాంతం. ఇక్కడ చాలా ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటిలో ‘ఉప్పలి అప్పన్’ ఆలయం కూడా ఒకటి. ఇక్కడి స్వామివారికి ఉప్పలేని వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఎందుకు ఉప్పులేని ఆహారం సమర్పిస్తారనేది తర్వాత తెలుసుకుందాం. ముందుగా ఆలయ విశేషాలేంటో చూద్దాం. తమిళనాడులోని తంజావూరులో ఈ ఉప్పిలి అప్పన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో రథోత్సవం జరుగుతూ ఉంటుంది. దీనిని చూసి తీరాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఉత్సవంలో శ్రీమహావిష్ణువు భూదేవితో కలిసి ఉప్పిలి అప్పన్​గా తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు.

ఇక ఆలయంలో స్వామివారికి జరిగే మరో ఉత్సవం వసంతోత్సవం ఇది కూడా కన్నుల పండువగా జరుగుతుంది. స్వామివారి కల్యాణోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్త జన సందోహం హాజరవుతుంది. ఇక్కడ భద్రాచలంలో మాదిరిగా శ్రీరామనవమి ఉత్సవాలు పది రోజుల పాటు జరుగుతాయి. పదవ రోజు కనకాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలను ముగిస్తారు. ఇక లక్ష్మీ సమేతంగా వెలసిన ఈ ఉప్పిలి అప్పన్​ స్వామివారిని దర్శించుకుంటే అవివాహితులకు తప్పక వివాహం జరుగుతుందట. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా భక్తులకు లభిస్తుంది. దీంతో ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ మాయమవుతాయట.

Share this post with your friends