అమావాస్య వట సావిత్రి వ్రతం గురించి తెలుసా?

జ్యేష్ట అమావాస్య రోజుకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఈరోజు శివుడిని పూజించడంతో పాటు రావి చెట్టును సైతం పూజిస్తూ ఉంటారు. ఈ రోజున ఏం చేయకూడదు? ఏం చేయాలి? ఈ రోజున నిర్వహించే వట సావిత్రి వ్రతం గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠ అమావాస్య రోజున మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. డబ్బు అప్పుగా తీసుకోవడం కానీ.. కొత్త వస్తువులు కొనడం కానీ.. తమ వల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజున వట సావిత్రి వత్రం కూడా జరుపుకుంటారు. వ్రత ప్రాధాన్యత, వ్రత విధానం గురించి తెలుసుకుందాం.

వట సావిత్రి వ్రతం స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం జరుపుకుంటారు. యమ ధర్మరాజు నుంచి సావిత్రీ దేవి తన భర్త సత్యవంతుడిని రక్షించిన పురాణ కథ ఆధారంగా ఈ వ్రతాన్ని మహిళలు జరుపుకుంటారు. మహిళలు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి, దానికి దారం కడతారు. ఆపై సావిత్రి దేవిని ప్రార్థిస్తారు. ఈ వ్రతం స్త్రీలకు అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, వైదవ్యం నుంచి రక్షణను ఇస్తుందని నమ్ముతారు.

వ్రత విధానం:

స్త్రీలు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మరి చెట్టుకు పూజ ఏర్పాట్లు చేస్తారు. కుంకుమ, పువ్వులు రావి చెట్టు దగ్గర వేస్తూ.. పండ్లు, నైవేద్యం సమర్పించి పూజ చేస్తారు. అనంతరం మర్రి చెట్టు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ దానికి దారం చుడతారు. సావిత్రి దేవి కథను చదవడమో.. వినడమో చేస్తారు. దీంతో పూజ పూర్తవుతుంది.

Share this post with your friends