ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పూరి జగన్నాథుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆలయం పైన వేలాడే జెండా నుంచి ప్రతిదీ ఆసక్తికరమే. ఎందుకంటే ప్రతి దానిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా జరిగే రథోత్సవం.. ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ యాత్రలో కొన్ని వేల మంది పాల్గొంటారు. స్వామివారి రథం లాగేందుకు పోటీ పడుతుంటారు. రథయాత్రలో తాడు లాగితే చాలా పుణ్యమట. ఈ ఆలయాన్ని ఇంద్రద్యుమ్నుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇక భక్తులు ఈ ఆలయంలోని కన్నయ్యను అన్ని వేళలా చూడలేరు. దీనికి ఓ నిర్ధిష్ట సమయం ఉంది.
పూరీలోని జగన్నాథ ఆలయంలో చాలా విషయాలు శాస్త్ర విరుద్ధంగా ఉంటాయి. ఏమాత్రం నమ్మశక్యం కాని ఘటనలు చాలానే ఉన్నాయి. ఆలయంపై ఉన్న జెండా గాలికి ఎప్పుడూ వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోందన్న విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు. మరో ఆసక్తిక రవిషయం ఏంటంటే.. ఈ ఆలయం నీడ రోజులో ఏ సమయంలోనూ కనిపించదు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. శ్రీకృష్ణుడి ఆలయంలో ఎప్పుడూ ఒక పరిమాణంలో ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు. అయినా సరే.. ప్రసాదం వృథా కావడం కానీ.. సరిపోకపోవడం కానీ జరగదు.