శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహన సేవల వివరాలు..

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో న‌వంబ‌రు 28 నుంచి డిసెంబ‌రు 6వ తేదీ జ‌రుగ‌నున్న కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల రోజువారి కార్య‌క్ర‌మాల‌ బుక్ లెట్ ను సోమవారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక‌ బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. డిసెంబరు 2వ తేదీ గజవాహనం, డిసెంబరు 3న బంగారు రథం, డిసెంబరు 5న రథోత్సవం, డిసెంబరు 6వ పంచమితీర్ధం వుంటుందని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద రాజన్, శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వాహనసేవల వివరాలు :

28-11-2024

ఉదయం – ధ్వజారోహణం

రాత్రి – చిన్నశేషవాహనం

29-11-2024

ఉదయం – పెద్దశేషవాహనం

రాత్రి – హంసవాహనం

30-11-2024

ఉదయం – ముత్యపుపందిరి వాహనం

రాత్రి – సింహవాహనం

01-12-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – హనుమంతవాహనం

02-12-2024

ఉదయం – పల్లకీ ఉత్సవం – వ‌సంతోత్స‌వం,

రాత్రి – గజవాహనం

03-12-2024

ఉదయం – స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం – స్వర్ణ రథం,

రాత్రి -గరుడవాహనం

04-12-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

05-12-2024

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వ వాహనం

06-12-2024

ఉదయం – పంచమితీర్థం

రాత్రి – ధ్వజావరోహణం.

Share this post with your friends