నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా?

నెమలి ఈకను ఇంట్లో పెట్టుకోవచ్చా? లేదా? అనేది చాలా మందికి ఉండే సందేహం. నిజానికి హిందువులు నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు. నెమలి ఈకలు శ్రీకృష్ణుడి శిరస్సుపై ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. దీనిని బట్టి నెమలి ఈకలకు ఎంతటి ప్రాధాన్యముందో అర్థం చేసుకోవచ్చు. ఇవి ఉన్న చోటంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. నెమలి ఈకలు ఇంట్లో ఉంటే మన కష్టాలన్నీ తొలిగిపోతాయని అంటారు. ముఖ్యంగా రాహు దోషం కారణంగా ఇబ్బందిపడే వారు ఇంట్లో తూర్పు లేదంటే వాయువ్య దిశలో నెమలి ఈకను ఉంచితే రాహువు ప్రభావం తొలగిపోతుందని నమ్ముతారు.

అలాగే నెమలి ఈకలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవని అంటారు. వీటిని ఇంట్లో ఉంచడం వలన గొడవలేమైనా ఉంటే సమసిపోతాయట. ప్రేమానుబంధాలు వికసిస్తాయట. పైగా నెమలి ఈక ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుందట. వ్యాపారంలో ఎదుగుదల కోరుకునే వారిని నెమలి ఈక మంచి పరిష్కార మార్గమట. వ్యాపార ప్రదేశంలేదా ప్రధాన ద్వారం వద్ద నెమలి ఈకను తూర్పు దిశలో ఉంచితే మంచి లాభాలు వస్తాయట. ఇంట్లో గొడవలు తగ్గి అనుబంధాలు బలపడాలంటే నెమలి ఈకతో పాటు వేణువును కూడా పెట్టుకోవాలట. మొత్తానికి నెమలి ఈకను నిస్సందేహంగా ఇంట్లో పెట్టుకోవచ్చట.

Share this post with your friends