
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో జూలై 16న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 15వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది. ఇక మిగిలిన దర్శనాలన్నీ సర్వసాధారణంగానే జరగనున్నాయి. కేవలం బ్రేక్ దర్శనాలను మాత్రం రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
తిరుమలలో వీకెండ్.. పైగా నిన్న రెండవ శనివారంసెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 30 గంటల పైనే సమయం పడుతోంది. దీంతో నిన్న మరీ ఇబ్బందికరంగా మారడంతో సాయంత్రం నుంచి భక్తులను క్యూలైన్లలోకి అనుమతించలేదు. తిరిగి ఆదివారం ఉదయం ఆరు గంటలకు క్యూలైన్ల వద్దకు రావాలంటూ టీటీడీ మైక్‌ల ద్వారా ప్రచారం నిర్వహించింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందిన వారికి మాత్రం 3 గంటల్లోనే దర్శనమవుతోంది.
