28 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నవంబర్ 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 వరకూ జరగనున్నాయి. తిరుమల శ్రీ మలయప్ప స్వామివారి బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మవారి బ్రహ్మోత్సవాలను సైతం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. నవంబర్ 27న సాయంత్రం అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. అనంతరం 28న ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

28 నుంచి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి వాహన సేవలు నిర్వహిస్తారు. అమ్మవారి సేవలన్నింటిలో గజ వాహన సేవకు ప్రత్యేకత ఉంది. గజం ఐశ్వర్యానికి సూచన. అందుకే ఆగజాంతకం ఐశ్వర్యం అని అభియోక్తి. గజవాహన ప్రియ కార్తీక మాసం పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలను ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భక్తులు తిరుచానూరుకు వెళ్లలేని వారు ఎస్వీబీసీ ఛానల్‌లో తిలకించవచ్చు.

Share this post with your friends