మంగళనాథ్ ఆలయం గురించి మనం తెలుసుకున్నాం. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షిప్రా నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి స్వామివారిని మంగళనాథ్‌గా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఎవరి జాతకంలోనైనా మంగళదోషం ఉంటె.. అది పోగొట్టుకోవడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అశుభాల నుంచి ఉపశమనం పొందేందుకు ఇక్కడి స్వామివారికి పూర్ణ క్రతువులతో పూజలు చేస్తారు. ఇక ప్రత్యేకంగా ఇక్కడ స్వామివారి కోసం భక్తులు భాత్ పూజ నిర్వహిస్తూ ఉంటారు.
మంగళవారం ప్రత్యేకంగా ఈ బాత్ పూజను నిర్వహిస్తూ ఉంటారు. జాతకంలో మంగళ దోషం తొలగడం కోసం భక్తులు ఆలయంలో భాత్ పూజ చేస్తారు. బాత్ అంటే ఏంటి అంటారా? అదొక వంటకం. దీనిలో కూరగాయలు, నెయ్యితో వండి అన్నం, వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ప్రత్యేక వంటకాన్నే బాత్ అంటారు. ఇది తయారు చేసి స్వామివారికి సమర్పించిన బాత్ పూజ చేస్తారు. ఇలా చేసిన బాత్ శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకొస్తుందని అక్కడి వారి నమ్మకం. ఇలా పూజ చేసుకుంటే మంగళ దోషం తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని నమ్మకం.