ఆ సమయంలో ఈ ఆలయంలోకి వీఐపీ, వీవీఐపీలకు నో ఎంట్రీ

గౌహతిలోని నీలాచల్ కొండలోని కామాఖ్య ఆలయంలో పెద్ద ఎత్తున అంబుబాచి మేళా ఇవాళ్టి నుంచి జరుగుతుందని.. ఆ మేళాకు సంబంధించిన వివరాలను సైతం మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మేళా గురించి ఇతర వివరాలను తెలుసుకుందాం. అంబుబాచి మేళా ప్రశాంతమైన, క్రమబద్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడి అధికారులు సమయంలో కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు. మేళా సమయంలో భక్తులకు నీలాచల్ కొండలోకి ప్రవేశం లిమిటెడ్‌గా మాత్రమే ఉంటుంది.పైగా సాయంత్రం 6 గంటల తర్వాత ప్రవేశం నిషేధం.

పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్వహించడానికి, రద్దీని నివారించడానికి, నీలాచల్ కొండ వద్ద భక్తులకు వసతి లేదా ఆహారం కోసం ఎటువంటి ఏర్పాట్లు అందుబాటులో ఉండవు. మేళా సమయంలో, జూన్ 21 నుండి 30 వరకూ ఆలయానికి వీఐపీ, వీవీఐపీలకు ఎంట్రీని పూర్తిగా నిలిపివేస్తారు. ముఖ్యంగా.. ఆలయాన్ని తిరిగి తెరిచిన తొలి రెండు రోజులు అంటే.. జూన్ 26, 27 తేదీలలో సాధారణ దర్శనం కోసం ఆలయం తిరిగి తెరిచినప్పుడు కూడా వీఐపీ, వీవీఐపీ దర్శనాలకు అనుమతి ఉండదు. జూన్ 28 నుంచి సాధారణ రోజువారీ దర్శనాలు తిరిగి ప్రారంభమవుతాయి.

Share this post with your friends