ఈ అమ్మవారికి మేకను బలి ఇచ్చిన వెంటనే లేచి తిరుగుతుంది.. ఆ వింతేంటంటే..

కొన్ని ఆలయాల్లో దేవుళ్లకు జంతు బలి ఇవ్వడం ఆచారంగా కొనసాగుతూ ఉంటుంది. కోడి లేదంటే మేకను అమ్మవారికి బలి ఇచ్చి మొక్కు చెల్లించుకుంటాం. అయితే బలి ఇచ్చిన కోడి లేదంటే మేక లేచి తిరగడం ఎప్పుడైనా చూశారా? కానీ ఓ ఆలయంలో జరిగిందట. ఆ ఆలయమేదో తెలుసుకుందాం. బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పన్వర కొండపై ఉన్న ముండేశ్వరి భవాని ఆలయం ఉంది. ఇక్కడ భవాని దేవి ఎప్పుడూ రక్తాన్ని ఆశించడం కానీ.. జంతు బలి కానీ కోరదట. కాబట్టి ఇక్కడ బలి ఇచ్చే విధానం ప్రత్యేకంగా ఉంటుంది.

ఇక్కడ అమ్మవారికి మేకను బలిచ్చేందుకు కత్తి లేదా ఇతర ఏ ఆయుధాన్ని వినియోగించరు. అమ్మవారి అక్షితలను మేకపై వేస్తారు. ఆ వెంటనే మేక చనిపోయి.. వెంటనే ఆ అక్షతలను విసిరితే మేక సజీవంగా లేచి తిరుగుతుంది. దీనికి కారణంగా అక్షితల ప్రభావం కారణంగా మేక స్పృహ కోల్పోయి నేలపై పడి శ్వాస ఆగిపోతుంది. అనంతరం పూజ నిర్వహించి మిగిలిన అక్షితలను మేకపై పోస్తారు. ఆ వెంటనే మేక మళ్లీ జీవం పోసుకుంటుంది. ఈ సంప్రదాయాన్ని చూసేందుకు ప్రతి రోజూ పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.

Share this post with your friends