జమ్మూ కశ్మీర్‌లోని అమరనాథ్ ఆలయం ఎన్నో రహస్యాలకు నెలవని అంటారు. వాటిలో ఒకటి జంట పావురాలు.. వీటి కథేంటంటే.. పరమశివుడు పార్వతిదేవికి గుహలో అమరత్వం గురించి బోధించాడని చెబుతారు. ఆ సమయంలో ఆ గుహలో రెండు జంట పావురాలు కూడా ఉన్నాయట. శివుడు పార్వతికి బోధించిన మంత్రోపదేశాన్ని ఆ పావురాలు కూడా ఉన్నాయని, అందుకే ఇప్పటికీ ఆ గుహలోనే ఆ జంట పావురాలు సజీవంగా ఉన్నాయని అంటారు. ఎందుకంటే శివయ్య చెప్పే అమరత్వం గురించి వింటే వారికి మరణం ఉండదని అంటారు. అలాగే ఆ రెండు పావురాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయని.. అమరనాథ్ యాత్ర చేసిన వారు చెబుతారు.
హిందూ పురాణాల ప్రకారం అయితే ఈ గుహ పరమ శివుడు మూడో కన్ను తెరవడం వల్ల ఏర్పడింది. ఇక్కడ శివలింగం దానంతట అదే సహజంగానే పెరుగుతోంది కాబట్టి దీనిని సహజలింగమని కూడా పిలుస్తారు. ఇక అమరనాథ్ స్థలపురాణం ప్రకారం.. పంచభూతాలైన భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశంలను ఆ పరమేశ్వరుడే ఈ గుహ పరిసర ప్రాంతాల్లో వదిలిపెట్టారని కాబట్టి ఈ ప్రాంతాన్ని పంచతరణి అని కూడా పిలుస్తారట. అమర్‌నాథ్ గుహలో శివుడు జల రూపంలో ఉంటాడట. అక్కడ ప్రవహించే పంచ నదులు ాయన జటాజూటం నుంచి ప్రవహించినవేనని చెబుతారు. అమరనాథ్ గుహలోని శివలింగం దగ్గర నుంచి ప్రవహిస్తున్న నీరే దీనికి సాక్ష్యమని చెబుతారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ నీరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎలా వస్తుంది? అనేది పెద్ద మిస్టరీ.