అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల‌లు ఇవాళ ఉందయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిన్నసాయంత్రమే బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జ‌రిగింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణకు కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. ముందుగా మేదిని పూజ చేప‌ట్టారు. ఆ త‌రువాత సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా శ్రీ విష్వక్సేనుల‌వారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ప‌ర్యవేక్షిస్తార‌ని ప్రతీతి. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణం నిర్వహించారు.

ఇక ఇవాళ ఉదయం 6.55 నుంచి 7.25 గంటల మ‌ధ్య మిథున ల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన ఒకటి కావడం విశేషం.

Share this post with your friends