హనుమకొండలోని సిద్ధేశ్వరాలయం గురించి మనం ముందుగానే తెలుసుకున్నాం. ఇక ఈ ఆలయంలోకి సూర్య కిరణాలు పడే అవకాశమే లేదు. ఆలయం వచ్చేసి పడమటి ముఖ ద్వారం కలిగి ఉంటుంది. పైగా నలువైపులా గుడిని కొండలు చుట్టేసి ఉంటాయి. ఈ తరుణంలో సూర్య కిరణాలు ఆలయంలోకి ప్రవేశించే అవకాశమే లేదు. అయినా సరే.. ఈ ఆలయంలోని శివలింగంపై సూర్య కిరణాలు పడటం ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఆలయం ముందు భాగంలో నంది మండపం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితులను సూర్య కిరణాలు గర్భగుడిలో పడే అవకాశమే లేదు. అయినా సరే శివలింగంపై సూర్య కిరణాలు పడతాయని తెలుసుకున్నాం.
ఇక ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. సూర్య దర్శనం అనంతరం నాగు పాము వచ్చి శివలింగం చుట్టు ప్రదక్షిణలు చేసి శివుడికి మొక్కు చెల్లించుకుంటుంది. ఈ రెండు విషయాలు అక్కడి వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇదంతా శివుడి మహత్యమని అక్కడి వారంతా అంటున్నారు. సూర్య దర్శనం అనంతరం శివుడికి కొత్తశక్తి లభిస్తుందని భక్తులు భావిస్తున్నారు. శివలింగాన్ని సూర్య కిరణాలు తాకగానే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్య కిరణాల మిస్టరీని ఛేదించేందుకు కాకతీయ యూనివర్సిటీ, ఎన్ఐటికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు పరిశోధనలు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనమూ లేదు.