నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో కొలువైన శ్రీశ్రీశ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలకు తేదీలు వచ్చేశాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2వ తేదీన గ్రామోత్సవంతో మొదలైన బ్రహ్మోత్సవాలు తిరిగి గ్రామోత్సవంతో ముగియనున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన ఆదివారం సాయంత్రం 4 గంటలకు నగరోత్సవంతో శ్రీశ్రీశ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
4వ తేదీ మంగళవారం నాడు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 6వ తేదీనాడు గురువారం ఉదయం 4 గంటలకు స్వామివారి అగ్నిగుండాలను ఏర్పాటు చేయనున్నారు. 7వ తేదీన అంటే శుక్రవారం నాడు ఉదయం 6:30 గంటలకు దీపోత్సవం, అశ్వవాహన సేవ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నాడు శనివారం రాత్రి 7 గంటలకు మహాపూర్ణాహుతి, పుష్పోత్సవం, ఏకాంత సేవలు నిర్వహించనున్నారు. 9 వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి గ్రామోత్సవం నిర్వహించనున్నారు.