అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు జూలై 13వ తేదీ అంకురార్పణ నిర్వహిస్తారు. జూలై 14న ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. 20వ తేదీన ఉదయం స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది.
వాహనసేవల వివరాలు :
14-07-2024
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
15-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
16-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
17-07-2024
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
18-07-2024
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
19-07-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
20-07-2024
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
21-07-2024
ఉదయం – రథోత్సవం (ఉదయం 9 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
22-07-2024
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం