ఇవాళ్టి నుంచి అంబుబాచి మేళా.. అసలేం చేస్తారంటే..

ఇవాళ అంటే జూన్ 22 నుంచి గౌహతిలోని నీలాచల్ కొండలోని కామాఖ్య ఆలయంలో పెద్ద ఎత్తున అంబుబాచి మేళా జరుగుతుంది. ఈ మేళా ఈ నెల 26 వరకూ జరుగుతుంది. ఈ అంబుబాచి మేళాకు ముందు భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి సైతం సాధువులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఈ మేళా కోసం రాష్ట్ర పర్యాటక శాఖ, కామాఖ్య డోలోయి సమాజ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి వచ్చే పెద్ద సంఖ్యలో భక్తుల కోసం పాండు పోర్టులో శిబిరాలను ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా ఇవాళ కామాఖ్య ఆలయంలో అంబుబాచి మహాయోగం ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 2:56 గంటలకు ‘ప్రవృత్తి’ (కామాఖ్య దేవత వార్షిక ఋతు చక్రం) ప్రారంభంతో కామాఖ్య ఆలయ తలుపులను మూసి వేస్తారు. మూడు రోజుల తర్వాత అంటే జూన్ 25 తర్వాత తలుపులను తెరుస్తారు. జూన్ 26న ఉదయం వేళల్లో ‘నివృత్తి’ (మేళా ముగింపు) కార్యక్రమంతో పాటు దేవత సాంప్రదాయ స్నానం, రోజువారీ ఆచారాలను నిర్వహిస్తారు. ఆ తర్వాత కామాఖ్య దేవత ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. అప్పుడు అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చు.

Share this post with your friends