కన్నుల పండువగా సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తికా నక్షత్ర కావడి ఉత్సవం

ఎన్టీఆర్ జిల్లా మచిలీపట్నం మేకవారిపాలెంలో కొలువై ఉన్న సుబ్రమణ్య స్వామి వారి ఆలయంలో ఆడి కృత్తికా నక్షత్ర కావడి ఉత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆలయానికి వేలాదిగా భక్తులు కావళ్ళతో బయలుదేరి కావడి యాత్రను నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కావడి సేవను ప్రారంభించారు. ఆ వెనుక కావళ్ళు ధరించిన భక్తులు స్వామి వారి నామ స్మరణ చేసుకుంటూ కావడి యాత్రలో పాల్గొన్నారు. పిల్లాపాపలు పెద్దలు అందరూ వేలాదిగా తరలి రావడంతో మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ సుబ్రమణ్యుని నామ స్మరణతో పులకించిపోయింది.

కృష్ణాజిల్లా మోపిదేవిలోనూ వైభవంగా ఆషాఢ కృత్తిక మహోత్సవాలు జరిగాయి. మూడు టన్నుల కూరగాయలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని పూజారులు అలంకరించారు. స్వామి వారి జన్మ దినం సందర్భంగా ఆడి కృత్తిక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. 108 కలశాలతో సహోత్తర కలశాభిషేకం నిర్వహించారు. భక్తులతో పోటెత్తిన మోపిదేవి సుబ్రమణేశ్వర స్వామి వారి ఆలయం పోటెత్తింది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించారు. కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు.

Share this post with your friends