
కుంతీదేవిని ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజనులు తమ ఆడపడుచుగా కొలుచుకుంటారని చెప్పుకున్నాం కదా.. కుంతీదేవిని గొంతెమ్మ దేవిగా కొలుచుకుంటారు. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం లోని సూర్యారావు పాలెంలో గొంతెమ్మ దేవి జాతర ఘనంగా నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ జాతర పెద్ద ఎత్తున జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఈ గొంతెలమ్మ జాతరలో పాల్గొంటారు. ఇక్కడ గొంతెలమ్మకు ప్రత్యేక ఆలయం కూడా ఉంది.
ప్రతి ఏటా ఈ గొంతెలమ్మ జాతరను నిర్వహిస్తూ ఉంటారు. గొంతెలమ్మ ఆలయానికి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అమ్మవారి వాహనాన్ని అలంకరిస్తారు. ఆర్కెస్ట్రాలు, వేషధారణలు, మేళ తాళాలు, డీజేలతో అంగరంగ వైభవంగా అమ్మవారిని ఆ వాహనంలో ఎక్కించి గ్రామంలోని వాడవాడలా ఊరేగిస్తారు. అమ్మవారి వాహనానికి పెద్ద ఎత్తున భక్తులు రోడ్డుకు రెండు వైపులా నిలుచుని నీరాజనాలు పలుకుతారు.
