
తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకూ ఈ సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
ఇందులో భాగంగా అక్టోబరు 3 (అంకురార్పణం) నుంచి 12వ తేదీ (చక్రస్నానం) వరకూ ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతోంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. ఇక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరగనున్నాయి.
