భద్రాద్రి రామయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న పక్షి

దక్షిణ అయోధ్యగా భద్రాద్రి కొనసాగుతోంది. అలాంటి భద్రాద్రిలో తాజాగా ఓ విచిత్రం చోటు చేసుకుంది. భద్రాద్రికి వెళ్లిన వారంతా సీతారాములను ముందుగా దర్శించుకుంటారు. అనంతరం పక్కనే ఉన్న పర్ణశాలను కూడా దర్శించుకుని వెళతారు. అలాగే భద్రాద్రి రామయ్యకు తమ శక్తి మేర ఎంతో కొంత డబ్బో లేదంటే నగలో అదీ కాదంటే మరేదైనా వస్తువో హుండీలో వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇదంతా కామన్. మరి విశేషం ఏంటంటే తాజాగా ఒక పక్షి భద్రాద్రి రామయ్యను దర్శించుకుని మొక్కు చెల్లించుకుంది.

వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. సన్ బర్డ్ అనే పక్షిని కళింగరెడ్డి అనే వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఆయన రామయ్య భక్తుడు. నిత్యం రామనామాన్ని స్మరిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన తన కుటుంబంతో పాటు తను పెంచుకునే సన్ బర్డ్ పక్షితో పర్ణశాల రామాలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చాడు. ఆ పక్షి పంచవటి దృశ్యాల చుట్టూ పలుమార్లు తిరుగుతూ చూపరులను అమితాశ్చర్యంలో ముంచెత్తింది. అంతే పక్షిలోని భక్తి భావనను చూసిన భక్తులు జై శ్రీరాం అనే నినాదాలను పెద్ద ఎత్తున చేశారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది.

Share this post with your friends