17 నుంచి తొండమాన్ పురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు

తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 16న సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా ఆగస్టు 17న ఉద‌యం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, ఆగ‌స్టు 18న ఉద‌యం పవిత్ర సమర్పణ, సాయంత్రం చ‌తుష్టానార్చ‌న నిర్వ‌హిస్తారు.

ఆగస్టు 19న ఉద‌యం మహా పూర్ణాహుతి, ప‌విత్ర విత‌ర‌ణ‌, స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంత‌రం సాయంత్రం ప్రాకార ఉత్స‌వం, ఆస్థానం చేప‌డ‌తారు. ఆగ‌స్టు 15 నుంచి 17వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగ‌స్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

Share this post with your friends