Why Shouldn’t You Pluck Tulsi Leaves At Night : రాత్రి సమయంలో తులసి ఆకులను ఎందుకు తుంచకూడదు…శాస్త్ర విజ్ఞానాలు ఏం చెబుతున్నాయి?

హైందవ ధర్మంలో తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసిని పూజించడంలో కఠినమైన నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో తులసి ఆకులను తుంచకూడదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. శాస్త్రీయంగా చూస్తే, రాత్రివేళ మొక్కల శ్వాసక్రియ మారుతుంది. తులసి తన జీవశక్తిని విశ్రాంతి స్థితిలో ఉంచుతుంది. ఆ సమయంలో ఆకులను కోయడం వల్ల దాని ఔషధ గుణాలు తగ్గుతాయని భావిస్తారు. శాస్త్ర ప్రకారం చూసుకుంటే… రాత్రి తులసిని తాకడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి కుటుంబంలో మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని నమ్మకం. అంతేకాదు, ఆదివారం, ఏకాదశి, గ్రహణ సమయాలు, అష్టమి, దశమి, పౌర్ణమి, అమావాస్య, రాత్రి సమయాల్లో తులసి ఆకులను తుంచకూడదని అంటారు. సూర్యోదయం తర్వాత తులసికి నీరు సమర్పించి… ఆకులు తుంచడం ఉత్తమం. ఆ సమయంలో తులసి సానుకూల శక్తితో నిండి, ఇంటికి సుఖశాంతులను అందిస్తుంది.

Why Shouldn't You Pluck Tulsi Leaves At Night
Why Shouldn’t You Pluck Tulsi Leaves At Night
Share this post with your friends