స్వామివారికి అన్నం ఎందుకు నివేదించాలి?

స్వామివారికి అన్నం ఎందుకు నివేదించాలి? అనే సందేహం చాలా మందికి వస్తూ ఉంటుంది.

1. అన్నం అంటే ఏమిటి?
అన్నం అనేది ప్రతి జీవికి ప్రాణాధారం. మన శాస్త్రాల ప్రకారం “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటే… భగవంతుడే అన్నంగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు.
మనం తినే ప్రతి గింజ కూడా దైవ ప్రసాదమే

2. స్వామివారికి ఎందుకు సమర్పిస్తారు?
మనకు లభించే అన్నం కోసం కృతజ్ఞతగా “స్వామీ! నువ్వే ఈ అన్నాన్ని ఇచ్చావు” అని గుర్తు చేసుకోవడం మనం తినే ముందు భగవంతుడికి ముందుగా ఇవ్వడం
ఇది మన వినయం, భక్తిని చూపించే పద్ధతి దీనిని నైవేద్యం అంటారు.

స్వామివారికి అన్నం ఎందుకు నివేదించాలి?
స్వామివారికి అన్నం ఎందుకు నివేదించాలి?

3. ఆధ్యాత్మిక అర్థం ఏమిటి?
అన్నం నివేదించడం వెనుక గొప్ప భావం ఉంది అహంకారం తగ్గుతుంది (నేనే సంపాదించాను అన్న భావం పోతుంది) దైవానుగ్రహం పెరుగుతుంది. మనం తినేది “ప్రసాదం” అవుతుంది. పవిత్రమవుతుంది

4. సమస్త లోకానికి శుభం కోసం
స్వామివారికి అన్నం పెట్టేటప్పుడు ఇలా ప్రార్థిస్తారు: “ప్రపంచంలోని ప్రతి జీవికి అన్నం లభించాలి” ఎవరూ ఆకలితో ఉండకూడదు ప్రకృతి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి

5. తిరుమలలో తిరుప్పావడ సేవ మహిమ
తిరుమల టెంపుల్ లో జరిగే తిరుప్పావడ సేవ ప్రత్యేకమైనది. స్వామివారికి పెద్ద మొత్తంలో పులిహోర అన్నం సమర్పిస్తారు. ఇది అన్నకూటోత్సవం అని కూడా అంటారు ఈ సేవ చూసిన వారికి అపార పుణ్యం కలుగుతుందని నమ్మకం.

పెద్దలు చెప్పిన విశ్వాసం: పులిహోరలో ఉన్న ప్రతి మెతుకుకి ఒక సంవత్సరం స్వర్గ ఫలం

6. సారాంశం
మనకు అన్నం ఇచ్చేది దేవుడే… అందుకే ముందుగా ఆయనకే సమర్పించి, తరువాత ప్రసాదంగా స్వీకరిస్తాం.

Share this post with your friends