మన లెక్క వేరు.. దేవుడి లెక్క వేరు..

ఇద్దరూ బంగారు నాణేలను పంచుకునే విషయమై పెను వివాదమే తలెత్తింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి న్యాయాధికారి దగ్గరకు వెళ్లారు. ఆ న్యాయాధికారి పంచాయతీని తదుపరి రోజుకు వాయిదా వేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. రాత్రి పడుకున్న తర్వాత న్యాయాధికారి కలలో దేవుడు కనిపించి ఏం తీర్పు చెప్పబోతున్నావని అడుగుతాడు. నాకు రెండో వాడు చెబుతున్నదే న్యాయంగా తోస్తున్నది అని అంటాడు. అందుకు దేవుడు నవ్వేసి నువ్వు కథ సరిగా విన్నావా అని అడిగి మూడు రొట్టెలు ఇచ్చిన వాడికి న్యాయంగా ఒక్క బంగారు నాణెం మాత్రమే ఇవ్వాలి అని అంటాడు. న్యాయాధికారి అదెలా అని అడుగుతాడు. ఎలాంగంటే మొదటి వాడి దగ్గర ఉన్నవి మూడు రొట్టెలు వాటిని అతడు 9 ముక్కలు చేశాడు. రెండో వాడి దగ్గర ఉన్నవి ఐదు రొట్టెలు వాటిని అతడు 15 ముక్కలు చేశాడు.

అయితే మొదటి వాడు వాడి రొట్టెల్లోని 9 ముక్కల్లో 8 అతడే తినేశాడు. కానీ రెండో వాడు తన 15 ముక్కల్లో 7 ముక్కలు మూడో వాడికి పెట్టాడు. కాబట్టి ఏడు నాణాలు రెండో వాడికి చెందాలి ఇదే నాలెక్క, ఇదే న్యాయం కూడా అని తేల్చేశాడు. తెల్లవారి న్యాయాధికారి ఇదే తీర్పు చెప్పాడు. అది విని మొదటి వాడు ఇతడే నయం 3 నాణాలు ఇస్తానన్నాడు మీరు ఒక్కటే ఇస్తున్నారు అని వాపోయాడు. అది విని న్యాయాధికారి అతడికి ఒకటే ఎలా చెందుతుందో వివరించాడు. దీన్ని బట్టి అర్థం అయ్యిందేమిటంటే మనం వేసుకునే లెక్కలు వేరు, దేవుడి లెక్కలు వేరు. మనదగ్గర ఉన్నదాంట్లో మనం ఎంత ఇతరులతో పంచుకోగలుగుతున్నమన్నదే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. 30 కోట్లు ఉన్నవాడు 3 లక్షలు దానం చెయ్యడం గొప్పగా దేవుడు పరిగణించడు, 3 వేలు ఉన్నవాడు 300 దానం చెయ్యడాన్నే గొప్పగా భావిస్తాడు. పుణ్యంగా జమకడతాడు. దేవుడి దృష్టిలో మనకెంత ఉంది అన్నది కాదు మనం ఎంత దానం చేశాం అనేదానికే విలువ.

Share this post with your friends