Banyan Tree Protected Dhwajasthambam : అక్కడ మర్రిచెట్టే దేవాలయం… ధ్వజస్తంభానికే పూజలు

ఆలయం శిథిలమైనా భక్తి శాశ్వతమని చాటే అపూర్వ దృశ్యం ఇది. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జిల్లెలమూడి గ్రామ సమీపంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన జనార్ధనస్వామి ఆలయం కాలక్రమేణా కూలిపోయింది. అయితే ఆలయ ధ్వజస్తంభం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. ఆ ధ్వజస్తంభాన్ని వందల ఏళ్లుగా ఓ పవిత్ర మర్రిచెట్టు తన శాఖలతో ఆలింగనం చేసుకుని కాపాడుతూ రావడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆలయం లేకపోయినా, మూలవిరాట్టు మరోచోటికి తరలిపోయినా, ఈ ధ్వజస్తంభానికి నేటికీ భక్తులు పూజలు చేస్తున్నారు. వటవృక్షం హిందువులకు అత్యంత పవిత్రమని, ప్రళయకాలంలో శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై దర్శనమిచ్చాడని పురాణ విశ్వాసం. అందుకే ఆ చెట్టును నరకడం ఇష్టంలేక గ్రామస్థులు ధ్వజస్తంభాన్ని అలాగే వదిలేశారు. ఇది ప్రకృతి, భక్తి, సంప్రదాయాల మేళవింపుకు నిలువెత్తు నిదర్శనం.

Banyan Tree Protected Dhwajasthambam
Banyan Tree Protected Dhwajasthambam
Share this post with your friends