
రావణాసురుడు లంకలో సీతమ్మ తల్లిని తాకకపోవడానికి రెండు శాపాలు కూడా కారణమని చెబుతారు. ఆ శాపాలేంటో కూడా తెలుసుకుందాం. మొదటిది పుంజికస్థల శాపం. బ్రహ్మదేవుని సభకు వెళ్తున్న ‘పుంజికస్థల’ అనే అప్సరసను రావణుడు బలాత్కరించాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు రావణుడిని శపించాడు. ఏ స్త్రీనైనా ఆమె ఇష్టానికి విరుద్ధంగా తాకితే, రావణుడి పది తలలు వేయి ముక్కలై మరణిస్తాడని ఆ శాపం సారాంశం.
నలకుబేరుని శాపం రావణుడు దిగ్విజయ యాత్రలో ఉన్నప్పుడు కుబేరుని కుమారుడైన నలకుబేరుని భార్య ‘రంభను బలాత్కరించాడు. ఇది తెలిసిన నలకుబేరుడు ఆగ్రహించి, ఇకపై రావణుడు ఏ స్త్రీనైనా ఆమె అంగీకారం లేకుండా తాకితే తల ముక్కలై మరణిస్తాడని మరో శాపం ఇచ్చాడు. ఈ శాపాల భయం వల్లనే రావణుడు సీతమ్మను అశోకవనంలో ఉంచి, ఆమెను తనంతట తానుగా లొంగిపోవాలని కోరాడే తప్ప, ఎప్పుడూ ఆమెను తాకే సాహసం చేయలేదు.
