ఉడిపిలో ప్రతిష్టించిన శ్రీకృష్ణుడి విగ్రహ కథేంటంటే..

ఒకసారి మధ్వాచార్యుల వారు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించారట. అప్పుడు ఓడలోని ముఖ్య నావికుడు భక్తి భావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు. శ్రీ మహావిష్ణువు వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు. ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3 ద్వాదశ స్తోత్రంగా పిలువబడింది. ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది.

ఆ విగ్రహాన్ని 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు. ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు. యుక్తవయస్సులో కన్యకుమారి, రామేశ్వరం, శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.

Share this post with your friends