
వెంగమాంబ అని చిన్న వయసులోనే కావ్యాలు రచించేవారని తెలుసుకున్నాం కదా. ఆమె మదనపల్లికి చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యయోగి వద్ద ఆధ్యాత్మిక, యోగవిద్యలలో ఉపదేశం పొంది అపారమైన జ్ఞానాన్ని సముపార్జించింది. భక్త కవయిత్రిగా, మహాయోగినిగా వెంగమాంబ పేరు గడిచింది. ఈ క్రమంలోనే ఆమె వేంకటేశ్వరస్వామి వైభవము, రామాయణం వంటి రచనలు చేసి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కొంతకాలానికి శ్రీనివాసుడిపై భక్తితో తరిగొండను విడిచి తిరుమలకు చేరుకుని.. అక్కడ శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ దూరంలో దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపారట.
ప్రతి రాత్రి తన ఇంటి ముందు నుంచి ఊరేగింపుగా వచ్చే శ్రీనివాసమూర్తికి వెంగమాంబ వెండి పళ్లెంలో ముత్యాల హారతి ఇచ్చేవారట. కాలక్రమేణా దానిని శ్రీవారి ఆలయ అర్చకులు సైతం కొనసాగించారు. శ్రీవారి ఆలయంలో తరిగొండ వెంగమాంబ పేరిట ఏకాంతసేవలో శాశ్వతంగా ముత్యాలహారతి అనే నిత్యకైంకర్యాన్ని నెలకొల్పారు. జీవితాంతం శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించిన వెంగమాంబ 1817 ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ నవమినాడు సజీవ సమాధి చెందింది. ఇప్పటికీ ఆమె సమాధి తిరుమలలోని ఉత్తర వీధిలో ఉన్న ఒక పాఠశాలలో ఉంది. ఈసారి తిరుమలకు వెళితే వెంగమాంబ జీవ సమాధిని వీలైతే దర్శించుకోండి.
