తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాలో కుర్తాళంలో చిత్రావతి జలపాతం ఉంటుంది. ఆ తరువాత ఇక్కడ గణపతి దేవునికి నాడీ గణపతి అనే పేరు వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. ఈ స్వామికి నాడి కొట్టుకుంటూ ఉండటంతో నాడి గణపతి అని పేరు వచ్చిందని చెబుతారు. మౌనస్వామి ఈ గణపతికి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఒకసారి ఏదో కారణంగా ఇక్కడ స్వామివారి తొడల నుంచి శబ్దం రావడం ప్రారంభమైందట. వెంటనే స్వామివారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోతి కట్టారు. అప్పటి నుంచి స్వామివారి విగ్రహానికి ధోతి కడుతున్నారు. అలా స్వామివారు తన మహిమను కనబరిచారు.

పచ్చని ప్రకృతి సోయగాలు ఓ వైపు, ఉరకలేసే జలపాతం మరోవైపు ఈ క్షేత్రం అక్కడి వెళ్లిన వారిని ఆకట్టుకుంటుంది. ఇలా ప్రకృతి ఒడిలో వెలసిన ఈ మహిమ గల ఆలయానికి భక్తులు ప్రతి ఏడాది మొత్తం అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి నాడి గణపతితో పాటు.. మౌనస్వామి మఠాన్ని, శ్రీ సిద్దేశ్వరి పీఠాన్ని దర్శించుకుంటారు. ఒక్కసారి ఈ కుర్తాళం జలపాతంలో స్నానం చేసి, నాడీ గణపతిని దర్శిస్తే జీవితంలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవని నమ్మకం. అలాగే మానసిక సమస్యలు కూడా మటుమాయమవుతాయి. వీలైన వారంతా కుర్తాళం దర్శించి, ఆ నాడీ గణపతి ఆశీస్సులతో ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందాలి.
