హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. శనిభగవానునికి అత్యంత ప్రీతికరమైన మాసం పుష్యమాసం. ఈ మాసమంతా శనిదేవుని ఆరాధిస్తే కష్టాలు తొలగి, కర్మఫలాలు శుభప్రదంగా మారుతాయని శాస్త్రాలు చెబుతాయి. పుష్యమాసం డిసెంబర్ 21 నుంచి జనవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం, మకర సంక్రాంతి, కనుమ, మాస శివరాత్రి వంటి ముఖ్యమైన పండుగలు వస్తాయి. అలాగే తిరుమల, తిరుపతిలో అనేక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పుష్య పౌర్ణమి, భోగి, ఉత్తరాయణ పుణ్యకాలం ఈ మాసంలోనే వస్తాయి. ఈ కారణంగా పుష్యమాసం భక్తి, నియమాలు, దానధర్మాలతో గడపాల్సిన పవిత్ర కాలంగా భావిస్తారు.

