Ratham Muggu Importance : సంక్రాంతి పండుగ రోజున రథం ముగ్గు ఎందుకు వేస్తారో తెలుసా?

సంక్రాంతి పండుగ రోజున రథం ముగ్గు వేయడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక భావన దాగి ఉంది. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం మొదలయ్యే శుభ కాలం. ఈ సమయంలో ఇంటి ముందర గీతలతో వేసే రథం ముగ్గు సూర్యుని దివ్య ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గులో కనిపించే త్రిభుజాలు, చతురస్రాలు, షడ్భుజాల వంటి సమానాకృతులు జీవితంలో సుఖదుఃఖాలను సమబావంతో స్వీకరించాలని సందేశం ఇస్తాయి. గీతల మధ్యలో అలంకరించే పువ్వులు అష్టైశ్వర్యాలకు అధిపతైన మహాలక్ష్మి నివాసమని విశ్వాసం. ముగ్గులో గోపురంలా కనిపించే ఆకృతి ఆకాశానికి, ప్రకృతితో మన అనుబంధానికి సూచిక. ఇలా రథం ముగ్గు వేయడం ద్వారా సూర్యుడికి నమస్కరిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, ఇంట్లో శుభశక్తిని ఆహ్వానించడమే సంక్రాంతి సంప్రదాయంలోని అసలైన ఆధ్యాత్మిక భావనగా పెద్దలు చెబుతారు.

Ratham Muggu Importance
Ratham Muggu Importance
Share this post with your friends