Parijatham Plant Importance : పారిజాతం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఏం జరుగుతుంది?

పరమశివుడికి అత్యంత ఇష్టమైన పువ్వుల్లో పారిజాతం కూడా ఒకటి. ఈ పూల ప్రత్యేకతే వేరు. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే పారిజాతం మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మరి పారిజాతం మొక్కను ఇంట్లో పెంచుకోవడం శుభప్రదమేనా? తెలుసుకుందాం. హిందూ మతంలో పారిజాత పూలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇవి చూడటానికి చిన్నగా.. తెలుపు, నారింజ రంగులో అందంగా కనిపిస్తాయి. ఇక ఈ పూలు శివుడికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. అందుకే చాలా మంది లక్ష్మీదేవికి, శివుడికి ఈ పూలు సమర్పిస్తుంటారు.

Parijatham Plant Importance
Parijatham Plant Importance

ఈ పారిజాతం మొక్కను ఇంటిలో పెంచుకోవచ్చు కానీ కొన్ని నియమాలను మాత్రం పాటించాల్సిందేనని పండితులు చెబుతున్నారు. పారిజాతం మొక్కను ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నాటకూడదట. సోమవారం, శుక్రవారం మాత్రమే ఇంటిలో నాటాలి. ఇలా చేస్తే ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ రావడంతో పాటు సంపద పెరుగుతుందట. పారిజాతం మొక్క ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు సైతం తొలగిపోతాయట. వాస్తు సమస్యల కారణంగా ఇబ్బంది పడేవారు తమ ఇంట్లో పారిజాతం మొక్కను పెంచుకుంటే సరిపోతుందట. దీంతో వాస్తు దోషాలు తొలగడమే కాకుండా సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతుందట. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుందట.

Share this post with your friends