కుంతి వద్ద కర్ణుడు పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమట..

మహాభారతంలో కుంతీదేవి గురించి అందరికీ తెలుసు. అలాగే కర్ణుడు కుంతీదేవి వద్ద ఎందుకు పెరగలేదో కూడా తెలుసు. ఆమెకు వివాహానికి ముందే కర్ణుడు జన్మించాడు. సూర్య భగవానుడి వరప్రసాదంగా కర్ణుడు పుట్టాడు. అయితే కుంతీదేవి కర్ణుడిని తన వద్ద ఉంచి పెంచలేదు. దీనికి కారణం వివాహానికి ముందే ఆమె కర్ణుడికి జన్మనివ్వడం. తనకు కళంకం అంటుకుంటుందన్న భయంతో కర్ణుడిని నదిలో జాగ్రత్తగా వదిలిపెట్టింది. అయితే కర్ణుడు కుంతి వద్ద పెరగకపోవడానికి మరో కారణం కూడా చెబుతారు.

కుంతి వద్ద కర్ణుడు పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమట..
కుంతి వద్ద కర్ణుడు పెరగకపోవడానికి ఇది కూడా ఒక కారణమట..

ద్రుపద మహారాజు కుమార్తె అయిన ద్రౌపదిని అగ్ని సంజాతగా పేర్కొంటారు. అలాగే కర్ణుడు సైతం అగ్ని సంజాతగానే చెబుతారు. అందుకే కుంతీ దేవి వద్ద కర్ణుడిని పెరగనివ్వలేదని వ్యాస మహర్షి పేర్కొన్నారు. రెండు పరస్పర అగ్ని శక్తులు ఒకేచోట ఉండడం వల్ల వాటి శక్తి నశించిపోతుందట. అప్పుడు ఇటు కర్ణునికి, అటు ద్రౌపదికి కీర్తి దక్కేది కాదట. అందుకే కర్ణుడు కుంతీదేవి నుంచి దూరమవ్వాల్సి వచ్చిందని చెబుతారు. ఇలా కర్ణుడు కుంతీదేవికి దూరమవడం వల్లనే మహాదాతగానూ, ద్రౌపది భారతాన్ని నడిపించిన సూత్రధారిగానూ రాణించారుట. ఇదంతా శ్రీకృష్ణుడి మాయలో భాగమేనని చెబుతారు.

Share this post with your friends