Blue Moon 2026 : మార్చి 3న వచ్చే చంద్రగ్రహణం రోజున ఏం చేయాలి…

మార్చి 3న వచ్చే చంద్రగ్రహణాన్ని భక్తులు ప్రత్యేక ఆధ్యాత్మిక సందర్భంగా భావిస్తారు. పౌర్ణమి రోజున సూర్యుడు–భూమి–చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుందని శాస్త్రం చెబితే… సంప్రదాయం మాత్రం ఆత్మపరిశీలనకు ఇదో పవిత్ర సమయమని చెబుతుంది. గ్రహణం ప్రారంభానికి ముందు స్నానం చేసి, మనసును శాంతంగా ఉంచుకుని జపం, ధ్యానం చేయడం శ్రేయస్కరం. ఈ సమయంలో అనవసరమైన మాటలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. గ్రహణం ముగిసిన వెంటనే మళ్లీ స్నానం చేసి దేవుడిని స్మరించుకోవడం మంచిదని పెద్దలు అంటారు. తిరుమల వంటి ఆలయాల్లో దర్శనాలు తాత్కాలికంగా నిలిచినా, అది దేవాలయ శుద్ధి సంప్రదాయంలో భాగమే. హోలీ… పౌర్ణమితో కలిసి వచ్చిన ఈ చంద్రగ్రహణం మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వెలుగును నింపాలని భక్తులు ప్రార్థిస్తున్నారు. ఇది భయపడాల్సిన రోజు కాదు, ఆత్మశుద్ధికి వచ్చిన అవకాశం అని సనాతన ధర్మం మనకు బోధిస్తోంది.

Blue Moon 2026
Blue Moon 2026
Share this post with your friends