
‘మంగళమగుగాక జయమంగళం! మంగళమగు గాక శ్రీ పాదములకు!’ అని అండాళ్ తల్లి స్వామి ఆయా అవతారాలలో ప్రదర్శించిన పరాక్రమ ఆశ్రిత రక్షణా వాత్సాల్యలకు ముగ్ధురాలై మంగళాశాసనం పాడింది. తన సఖులైన గోపికలతో వీరు పాడిన మంగళాశాసనమునకు తన్మయులైన స్వామి ‘మీకేమి కావలయున ‘నిన; మాకేవైన ప్రతిబంధకములున్న వానినెల్ల నీవే పోగొట్టి మాలోని, అన్యకామనలేమైనయున్న వాటిని ‘నశింపచేసి’ మమ్ము అనుగ్రహించుమని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి ఈ (పాశురంలో) అర్ధించుచున్నది.
(బిళహరి రాగము-ఝుంపెతాళము)
ప … పురషార్ద మర్దింప వచ్చినారము స్వామి
పురుషార్దమిడి మా మనోరథ మీడేర్పుమా!
అ…ప… వరలక్ష్మి యాశించు పరమ సంపదనెల్ల
కీర్తించి దుఃఖమ్ము బోవ సుఖియింతుము
చ… దేవకికి పుత్రునిగ అవతరించిన రాత్రి
దేవి యశోధకును వరసుతుడవై పేరుగ
తా విన్న కంసుడట కీడు దలపగ నెంచ
నీవె కంసుని గర్భ మగ్నివలె వ్యాపించి
ఆ యత్నమంతయు వమ్ముజేసిన స్వామి
పురుపార్ధమర్ధింప వచ్చినారము స్వామి
పురుషార్ధామిడి మా మనోరథ మీడేర్పుమా!
