అక్షయ తృతీయ రోజున ఇలా పూజ చేస్తే.. ఫలితం మీకే తెలుస్తుంది..

మరి కొన్ని గంటల్లో అక్షయ తృతీయను జరుపుకునేందుకు హిందువులంతా సిద్ధమవుతున్నారు. అక్షయ తృతీయను హిందువులంతా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం వంటివి చేస్తే కలిసొస్తుందని భావిస్తూ ఉంటారు. అయితే అక్షయ తృతీయ నాడు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. వైశాఖ శుక్ల తృతీయ తిథి మే 10వ తేదీ 2024 ఉదయం 04:17 గంటలకు ప్రారంభమై ఈ తిధి మే 11వ తేదీ తెల్లవారుజామున 02:50 గంటలకు ముగుస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ పండుగను మే 10 శుక్రవారం జరుపుకుంటారు.

ఇక అక్షయ తృతీయ నాడు ఏ సమయంలో పూజ చేస్తే ఫలితం బాగుంటుందో కూడా తెలుసుకోవాలి. ఉదయం 05:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు పూజకు అద్భుతమైన సమయమని పండితులు చెబుతున్నారు. ఇక ఆ రోజున సాయంత్రం తులశమ్మ దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు చాలా ఇష్టమట. కాబట్టి తులశమ్మను పూజించుకోవడం ఆర్థికంగానూ బాగుంటారు. అలాగే ఆరోగ్యంగానూ బాగుంటారట. ప్రతి కోరిక నెరవేరుతుందట. పూజలో సైతం తులసి దళాలను సమర్పించి ధూప, దీప నైవేద్యాలతో పూజించుకుంటే మంచిదట.

Share this post with your friends