ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటికే ఐదు జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆరో జ్యోతిర్లింగం గురించి తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆరవది భీమ శంకరం. ఈ ఆలయాన్ని శివ భక్తులంతా అత్యంత పవిత్ర క్షేత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంతో అనే పురాణ గాథలు ముడిపడి ఉన్నాయి. ఎంతో విశిష్టత కలిగిన భీమ శంకర క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ క్షేత్ర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సందర్భంగా భీమ శంకరం క్షేత్రం ఎక్కడుంది? ఆ క్షేత్ర విశేషాలేమిటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శివుడు జ్యోతి రూపంలో వెలసిన జ్యోతిర్లింగాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశించి మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. శివ భక్తులంతా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భావిస్తారు. ఇక భీమ శంకర క్షేత్రం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులపై ఉంటుంది. ఇక్కడి ప్రకృతి మాటల్లో చెప్పేందుకు సాధ్యం కాదు.. చూసి తరించవలిసిందే. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్ర సమీపంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రం సమీపంలో భీమ నది ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులంతా ముందుగా భీమ నదిలో స్నానం చేసి అనంతరం శివుడిని దర్శించుకుంటారు.
