హిందూ వివాహ సంప్రదాయం తాళికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే మూడు ముళ్లు వేయడానికి ఒక కారణం ఇప్పటికే మనం తెలుసుకున్నాం. మరో కారణం కూడా ఉంది. అది కూడా తెలుసుకుందాం. అదేంటంటే.. మూడు ముళ్లలో ఒక్కో ముడికి ఒక్కో అర్థం ఉందని పండితులు చెబుతారు. ఈ మూడు ముడుల అర్థం ఏంటో ముందుగా తెలుసుకుందాం. వివాహ బంధంలో ఈ మూడు ముళ్ల ప్రత్యేకత, దాని గొప్పతనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తాళి కట్టే సమయంలో వేసే మొదటి ముడిని ధర్మేచ్ఛ అని అంటారు. అంటే భార్యాభర్తలిద్దరూ ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మ మార్గంలో నడవాలని అర్థం.

అలాగే ప్రతి పనిలో నిబద్ధతగా ఉంటూ ముందుకు సాగాలని తొలి ముడి అర్థం. ఇక తాళి కట్టే సమయంలో వేసే రెండవ ముడిని అర్థేచా అంటారు. ఇది కుటుంబ వృద్ధిని సూచిస్తుందని చెబుతారు. దంపతులిద్దరూ.. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, కష్టపడి కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలని అర్థం. ఇక మూడవ ముడి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంకేతంగా చెబుతారు. దంపతులిద్దరూ అనురాగం, అప్యాయతలు, ప్రేమతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని అర్థం. వంశ వృద్ధి చేసి, కలకలం కష్టసుఖాల్లో పాలుపంచుకొని జీవించాలని వివాహంలో వేసే మూడు ముళ్లు సూచిస్తాయి. దాంపత్య జీవితానికి ఈ మూడు ముళ్లు అర్థాన్ని ఇస్తాయని చెబుతారు.
