కలశాన్ని మనం ఎందుకు పూజిస్తాం?

మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము అంటే సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్యపై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుంచి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. కలశంలోని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాల, చరించే ప్రాణుల అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచంలో ఉన్నదంతా సృష్టికి ముందుగానున్న శక్తి నుంచి వచ్చినది, శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే ‘ప్రేమ’ ను సూచిస్తుంది. అందువల్లనే ‘కలశం’ శుభసూచకంగా పరిగణింపబడి పూజింప బడుతున్నది.

అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము, దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు ‘అభిషేకము’ సహా అన్ని వైదికక్రియలకి వినియోగింపబడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్ధతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘కలశం’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీకగా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా ‘పూర్ణకుంభం’తో హృదయ పూర్వకంగా స్వాగతమిస్తాము.

వినాయకుడి పండుగకు వేళైంది. ఊరూ.. వాడా అన్నిచోట్ల వినాయక మండపాలు వెలుస్తున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఆగస్ట్ 27 బుధవారం నాడు వినాయకచవితి రానుంది. నిత్య పూజలు, భక్తుల భజనలతో పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎక్కడ ప్రతివాడలో సందడి నెలకొంటుంది. అయితే పెద్ద పెద్ద మండపాలు కొన్నింటికి ఇప్పటికే వినాయకుడిని తీసుకొచ్చేశారు. చిన్న మండపాల కోసమైతే ఒకరోజు ముందుగా తీసుకొస్తారు. మరి వినాయకుడిని తీసుకొచ్చేటప్పుడు తొండం ఎలా ఉండేలా చూసుకోవాలో తెలుసుకుందాం. కొందరు కుడి వైపు.. మరికొందరు ఎడమవైపు.. కొందరు మధ్యలో ఉన్నది చూస్తారు. మరి వాటిలో ఏది ఉత్తమం.

హిందూ పురాణాల ప్రకారం తొండాన్ని బట్టి వినాయకుడికి పేర్లు ఉంటాయి. కుడి వైపునకు తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని దక్షిణాభిముఖి గణేశుడు అని అంటారు. ఇలా ఉంటే మాత్రం.. కొన్ని నియమాలు పాటించాల్సిందేనట. వాస్తవానికి దక్షిణాభిముఖి గణేశుడి విగ్రహం చాలా శక్తివంతమైనదట. ఇలాంటి విగ్రహాన్ని చాలా పూజించడానికి చాలా నియమ నిబంధనలు ఉన్నాయనుకున్నాం కదా. ముందుగా అదేంటంటే… దేవాలయల్లో ఉండే నియమాలతో ఈ వినాయకుడిని పూజించాలని చెబుతారు. దాదాపుగా గణపతి విగ్రహాలన్నీ ఎడమవైపు తొండం ఉన్నవే ఉంటాయి. ఇవి చాలా ప్రశాంతంగా ఉండటమే కాకుండా పూజించిన వారికి శాంతి, సౌఖ్యం, సంపదను సూచిస్తాయి.

ముఖ్యంగా తొండ ఎడ ఇక మనం చాలా వరకు చూసే గణపతి విగ్రహాలు ఎడమ వైపున తొండం ఉన్నవే ఉంటాయి. ఇటువంటి విగ్రహాలు చాలా ప్రశాంతంగా, సంపన్నంగా ఉండటమే కాకుండా శాంతి, సౌఖ్యం, సంపదను సూచిస్తాయంట. ముఖ్యంగా ఎడమ వైపు తొండం ఉన్న విగ్రహాలను చంద్రుడితో పోలుస్తారు. దీనికి కారణమేంటంటే.. ఈ విగ్రహాలకు చంద్రుడికి ఉండే లక్షణాలన్నీ ఉంటాయట. అంటే ప్రశాంతత, చల్లదనం, సానుకూలత వంటివన్నమాట. ఇక వినాయక విగ్రహం తొండం పైకి ఉంటే మంచి జ్ఞానం, కిందకి ఉంటే కోరిన కోరికలు తీరుస్తాడు. కాబటట్టి ఈ లక్షణాలన్నింటినీ విగ్రహం కొనుగోలుకు ముందు దృష్టిలో పెట్టుకుంటే మీకు ఏ విగ్రహం కావాలో క్లారిటీ వస్తుంది.

Share this post with your friends