అయోధ్య రామయ్య ఆలయంలో ఏమేం కార్య్రమాలు నిర్వహించనున్నారంటే..

జనవరి 11న అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. శుక్ర యజుర్వేదంలోని 40 అధ్యాయాల 1975 మంత్రాలు అగ్నిదేవునికి సమర్పించబడం జరిగింది. ఈ నేపథ్యంలో 11 వేద మంత్రాలను పఠిస్తారు. ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిచడం జరుగుతోంది. ఈ పూజా కార్యక్రమాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదే సమయంలో శ్రీరామ మంత్రాన్ని పఠించే యాగం కూడా రెండు సెషన్లలో జరుగుతుంది. దీనిలో భాగంగా 6 లక్షల మంత్రాలు జపించనున్నారు.

అంతే కాకుండ పలు స్తోత్రాలను సైతం పఠించనున్నారు. రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, పురుష సూక్త, శ్రీ సూక్త, ఆదిత్య హృదయ స్తోత్రం, అథర్వశీర్ష తదితర పారాయణాలు కూడా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలోనూ బాలరామయ్యకు సేవ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు దక్షిణం వైపున ఉన్న ప్రార్థనా మందిరంలో బాల రామయ్యకు రాగసేవ సమర్పిస్తారు. అనంతరం ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని బాల రామయ్య సన్నిధిలో అభినందన గీతాలను కీర్తించనున్నారు. అలాగే ప్రయాణికుల సౌకర్యాల కేంద్రంలో సంగీత విభావరి, అగంద్ తిలా మైదానంలో రామచరిత మానస్, సాంస్కృతిక కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Share this post with your friends