వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణం కన్నుల పండువగా జరిగింది. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి, వధువు పార్వతి దేవి అమ్మవారిని మేళాతాళలతో ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో ఉదయం 10.55 నిమిషాల నుంచి 12.05 వరకు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివార్ల నేత్రపర్వంగా కొనసాగింది. ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళా తాళల మధ్య ఆలయానికి చేరుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు ధ్వజారోహణం నిర్వహించారు. ఈ కల్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ర్టం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.
2024-03-28