వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి

తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురుతీర్థ ముక్కోటిలో మార్చి 31, ఏప్రిల్ 01 తారీఖుల్లో 12 వేల మందికి పైగా భక్తులు పాల్గొని తీర్థమార్చిస్నానాన్ని ఆచరించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మార్చి 31వ తేదీఉదయం 6 గంట‌ల నుండి నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు భక్తులకు శ్రీవారిసేవకులు పంపిణీ చేశారు. ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలోనిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు.

 

వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి
వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి

 

దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండెసంబంధిత వ్యాధులతో బాధపడే వారిని, 12 ఏళ్ల లోపు పిల్లలను తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియోమరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపుసిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుచేపట్టారు.

Share this post with your friends